భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసిన మూవీ ధురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులోని షరారత్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఆయేషా ఖాన్ తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ ధురంధర్ అదరగొడుతున్న నేపథ్యంలో షరారత్ సాంగ్ గురించి ఆయేషా మాట్లాడింది.

ధురంధర్ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని షరారత్ సాంగ్ మరోసారి వైరల్ గా మారింది. ఈ పాట కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో తాను పీరియడ్స్ తో ఉన్నానని ఆయేషా ఖాన్ తాజాగా వెల్లడించింది. పింక్ విల్లాతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆయేషా ఈ విషయాన్ని తెలిపింది.

''రెండు రోజుల షూటింగ్ జరిగింది. అప్పుడు చాలా బిజీగా అనిపించింది. ఆ సమయం...