భారతదేశం, ఫిబ్రవరి 11 -- కార్తీకేయ 2తో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియాలో అదరగొట్టేందుకు 'స్వయంభు'తో రాబోతున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ను ఇవాళ (ఫిబ్రవరి 11) రిలీజ్ చేశారు మేకర్స్. అదిరే యాక్షన్, అద్భుతమైన విజువల్స్ తో టీజర్ అదిరిపోయింది.

స్వయంభు టీజర్

హీరో నిఖిల్ రెండేళ్లుగా స్వయంభు సినిమా కోసం కష్టపడుతున్నాడు. యోధుడి క్యారెక్టర్ కు తగ్గట్లు తన ఫిజిక్ ను మార్చుకున్నాడు. కత్తి పట్టి పోరాటాలు చేస్తున్నాడు. స్వయంభు మూవీ తీవ్రంగా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఆ కష్టం స్వయంభు మూవీ టీజర్ లో కనిపించింది. బుధవారం రిలీజైన ఈ టీజర్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి.

పీరియాడిక్ వార్ డ్రామా

స్వయంభు మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భర...