భారతదేశం, ఆగస్టు 9 -- ఒక మనిషికి వచ్చే పీడకల నిజమైతే? అతని కలలోని భయం నిజంగా కళ్ల ముందే కనిపిస్తే? ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో తీసిన షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసిన క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్ లెటర్' (Red Letter) శనివారం (ఆగస్టు 9) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిన్న సినిమాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మరి ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఏంటో చూద్దాం.

అజిత్ అరోరా దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్ లెటర్' ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 9న షెమరూమీ/ఓటీటీ ప్లే ప్రీమియం లో విడుదలైన ఈ లఘుచిత్రం ఒక మనిషి కలలోని భయం నిజ జీవితంలో ఎలా కలిసిపోతుందనే దాని చుట్టూ తిరుగుతుంది. మీరు ఊహించినట్లుగా ఇది ఒక ఎరుపు లేఖతో ప్రారంభమవుతుంది. అజిత్ అరోరా దర్శక...