భారతదేశం, జూన్ 20 -- ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) అనేది దేశంలో భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. పీఎం కిసాన్ యోజన 19వ విడత నిధులు ఫిబ్రవరి 24న విడుదలయ్యాయి. ఇప్పుడు 20వ విడత నిధుల విడుదల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు అవసరమైన లాంఛనాలను పూర్తి చేసి, తమ బెనిఫీషియరీ స్టేటస్​ని ఎప్పటికప్పుడు చెక్​ చేసుకోవాల్సి ఉంటుంది.

పీఎం కిసాన్​ 20వ విడత నిధుల విడుదలపై కేంద్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ పలు మీడియా కథనాల ప్రకారం జూన్​ 20న పీఎం కిసాన్​ డబ్బులు రైతుల ఖాతాల్లో పడొచ్చు. కాగా, ఈరోజు కాకపోతే, ఈ నెల చివరిలోగా నిధుల రైతుల అకౌంట్స్​లో పడతాయని మరికొన్ని మీడియా కథనాలు సూచిస్తున్నాయి.

ఈ పథకం కింద, తమ పేరు మీద సాగు చేయదగిన భూమి ఉన్న రైతు కుటుంబాలు ప్రయోజనం పొం...