భారతదేశం, జూలై 26 -- కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకంలో భాగంగా తొలి విడతలో విశాఖపట్నం నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. విశాఖలోని సింహాపురి ఈ-బస్ డిపోలో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ రూమ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రాంరంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని తెలిపారు. వీటిలో తొలి ప్రాధాన్యతగా విశాఖకు 100 బస్సులు కేటాయించామని, త్వరలోనే విజయావాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు నగరాలకు కూడా ఈ బస్సులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.

సింహాపురి డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ఆధునిక పవర్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. బస్సుల ఛార్జింగ్ కోసం ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్, ఛార్జింగ్ పాయ...