Hyderabad, సెప్టెంబర్ 22 -- బతుకమ్మ పండుగ నిన్నటి నుంచి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతారు. పూలతో బతుకమ్మను పేర్చి తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ ఆడుతూ సరదాగా జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూలమ్మ బతుకమ్మతో వేడుకలు మొదలయ్యాయి.

ఆ తర్వాత రెండవ రోజు అంటే ఈరోజు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుతారు. ఈ అటుకుల బతుకమ్మను జరిపే విధానం ఏంటి, వేటిని నైవేద్యం పెడతారు, ఏ పూలతో బతుకమ్మను పేర్చుతారు వంటి విషయాలను తెలుసుకుందాం.

అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను పెడతారు. దీనిని ఎక్కువగా చిన్నపిల్లలు చేస్తారు. అమ్మవారికి అటుకులను నైవేద్యంగా పెడతారు. పిల్లలందరూ అటుకుల బతుకమ్మ చుట్టూ ఆడుతూ, పాడుతూ సరదాగా జరుపుకుంటారు. బెల్లం అటుకులను పెద్దవాళ్లందరూ పిల్లలకు పంచుతారు. ఈ అటుకులను పిల్లలు ఇష...