భారతదేశం, జూన్ 22 -- మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవోభవ అని మనం అంటాము. అయితే తండ్రిని గౌరవించడం గురించి మాట్లాడుకుంటే, తండ్రిని గౌరవించి, తండ్రిని ఒక దైవంగా భావిస్తే ఆ పిల్లలు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.

ప్రతి మనిషి జీవితంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అండగా నిలిచే వ్యక్తి నాన్న. కష్టాలను కూడా దిగమింగుకుంటాడు. పిల్లల ముఖంలో నవ్వు చూడాలని నిరంతరం ఏదో ఒకటి త్యాగం చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక బాధను, కష్టాన్ని దాటుతూ ఉంటాడు. కుటుంబానికి వెన్నెముక నాన్న.

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను దైవ సమానులుగా భావిస్తాము. ఉపనిషత్తులు "మాతృదేవోభవ, పితృదేవోభవ" అని చెప్పడం ద్వారా తల్లిదండ్రులను గౌరవించడం ఒక మనిషి ప్రధాన ధర్మం అని గుర్తు చేస్తాయి. అయితే ఇది కేవలం మతపరమైన నమ్మకం అనుకుంటే పొరపాటే. ఉన్నతమైన జీవన ప్రమాణాలను పెంపొందించే సంద...