Hyderabad, సెప్టెంబర్ 13 -- మనం నిద్రపోయినప్పుడు అనేక కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలను మనం నిద్రలేచిన తర్వాత మర్చిపోతూ ఉంటాం కూడా. అయితే, ఒక్కోసారి భయంకరమైన పీడ కలలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాటిని మర్చిపోవడం కూడా కష్టమే. కొంత మందికి నిద్రపోయినప్పుడు ప్రశాంతమైన కలలు, అనుకున్నవి పూర్తి చేసినట్లు, విజయాలను చేరినట్లు ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి. వాటివలన పెద్దగా సమస్య ఉండదు.

కానీ కొంత మందికి ఎవరో తరుముతున్నట్లు, భయంకరమైన వర్షం, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి కొంత మందికి పితృ దేవతలకు పిండ ప్రధానం చేసినట్లు కలలు రావచ్చు. ఇలాంటి కలలు వస్తే దానికి అర్థం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం పితృపక్షం నడుస్తోంది. 15 రోజులు పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, పిండ ప్రధానం చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెంది వారి ఆశీస్సులను అందిస్త...