భారతదేశం, అక్టోబర్ 5 -- ఓటీటీలోకి లేటేస్ట్ తెలుగు సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (అక్టోబర్ 5) ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహ, సత్యం రాజేశ్, సాంచీ రాయ్ తదితరులు నటించారు.

సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలు పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఆదివారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.

''ప్రేమ, నష్టం, బద్దలు కాని బంధం. తన మనవరాలిని కనిపెట్టడం కోసం సైకియాట్రిస్ట్ పోరాటం. త్రిబాణధారి బార్బరిక్ అక్టోబర్ 10 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది'' అని సన్ నెక్ట్స్ ఎక్స్ లో పో...