భారతదేశం, అక్టోబర్ 22 -- హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. మనుషులు చేసిన సమస్త పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర దినాలలో ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

దీనినే 'పాపాంకుశ ఏకాదశి' అని పిలుస్తారు. ఈ వ్రత మహత్యం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరించినట్లు పద్మపురాణంలో పేర్కొనబడింది. జీవితంలో ఎన్నో పాపాలు చేసిన వారైనా సరే, ఈ ఒక్క రోజు భక్తిశ్రద్ధలతో శ్రీహరిని ఆరాధిస్తే సకల పాపాల నుంచి విముక్తి పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణుడు తెలిపిన వివరాల ప్రకారం, ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి రోజున పద్మనాభ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించాలి. మునులు ఎన్నో ఏళ్లపాటు కఠినమైన తపస్సు చేస్తే లభించే పుణ్యఫలం కేవలం గరుడధ్వజుడైన శ్రీహరిని మనసారా ప్రార...