భారతదేశం, సెప్టెంబర్ 29 -- పాపం.. షోయబ్ అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ టీమ్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వేరే లెవల్ ట్రోల్ తో అక్తర్, పాక్ టీమ్ పరువు తీసేశారు. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించిన భారత్ మరోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పోరులో ఇండియా ఆట తీరు, పాక్ ను చిత్తు చేసిన విధానంపై సెలబ్రిటీలు రియాక్టవుతున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా ట్వీట్ చేశాడు.

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నోరు జారాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బదులు అభిషేక్ బచ్చన్ పేరు వాడాడు. ఈ వ్యాఖ్యలను ఎగతాళి చేస్తూ అమితాబ్ ట్వీట్ చేశారు. షోయబ్‌ను ఆటపట్టిస్తూ అమితాబ్ 'అభిషేక్ బచ్చన్' బాగా ఆడినందుకు ప్రశంసించారు. టీం ఇండియా "దుష్మన్ (శత్రువు)"ని ఎలా ఓడించిందో కూడా ఆయన ట్వీట్ చేశారు.

''జీత్ గయే (గెలిచేశాం) !! 'అభిషేక్ బచ్చన్' బాగా ఆడావు. "ఉ...