భారతదేశం, జూలై 6 -- మీ సిబిల్ స్కోరు అనేది మీ క్రెడిట్ హిస్టరీని సూచించే సంఖ్య. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీ స్కోరును చెక్ చేసుకోవడం చాలా సులభం. మీరు స్వయంగా మీ స్కోరును తనిఖీ చేసినప్పుడు, అది సాఫ్ట్ చెక్ కిందకు వస్తుంది. ఇది మీ సిబిల్ స్కోరుపై ఎలాంటి ప్రభావం చూపదు! మీ క్రెడిట్ స్కోరును పాన్ కార్డు ఉపయోగించి ఉచితంగా తెలుసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోరుపై ఎటువంటి ప్రభావం లేకుండా, పాన్ కార్డుతో మీ సిబిల్ స్కోరును ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

మీ సిబిల్ స్కోరును చెక్​ చేయడానికి పాన్ కార్డు అవసరం. ఎందుకంటే ఇది ఆర్థిక లావాదేవీల కోసం ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది. రుణదాతలు, క్రెడిట్ బ్యూరోలు మీ క్రెడిట్ హిస్టరీని బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) అంతటా ట్రాక్ చేయడానికి పాన్‌ను ఉపయోగిస్త...