భారతదేశం, నవంబర్ 18 -- దేశవ్యాప్తంగా అతి త్వరలో పెళ్లిళ్ల సీజన్ సందడి మొదలవుతోంది. ఈ నేపథ్యంలో చాలా కుటుంబాలు కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో ఇంట్లో బీరువాల్లో ఇంతకాలం దాచి ఉంచిన పాత బంగారు నగలను కొత్త ట్రెండ్‌కు తగ్గట్లుగా మార్చుకోవాలని చాలామంది భావిస్తున్నారు. మారుతున్న డిజైన్లు, అభిరుచులకు అనుగుణంగా వినియోగదారుల ముందు రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి: పాత నగలను ఇచ్చి షోరూమ్‌లో కొత్త ఆభరణాలు తీసుకోవడం (ఎక్స్​ఛేంజ్), లేదా ఉన్న పాత బంగారాన్నే కరిగించి కొత్త డిజైన్‌లో చేయించుకోవడం (రీ-మోడలింగ్). అయితే ఈ రెండింటిలో ఏది మన జేబుకు తక్కువ భారమవుతుంది? వేటికి ఎలాంటి ఛార్జీలు పడతాయి? అన్న విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం.

ఎక్స్​ఛేేంజ్ విధానంలో వినియోగదారులు తమ వద్ద ఉన్న పాత లేదా విరిగిన బంగారు ఆభరణాలను ...