భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న ఓజీ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ సినిమా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన నాన్ పాన్ ఇండియా మూవీగా రికార్డు నమోదు చేసింది. కేవలం తెలుగులోనే రిలీజైన పవన్ కల్యాణ్ మూవీ పవర్ కు ఇది నిదర్శనం.

అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోలతోనే అదరగొట్టిన ఓజీ మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు (సెప్టెంబర్ 25) వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు కుమ్మేసింది. ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ఓజీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన నాన్ పాన్ ఇండియా మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది.

ట్రేడ్ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం ఓజీ చిత్రం ఇండియాలో పెయిడ్ ప్రివ్యూలతో రూ.20...