భారతదేశం, సెప్టెంబర్ 21 -- పవన్ కల్యాణ్ అప్ కమింట్ మూవీ 'దే కాల్ హిమ్ ఓజీ'. ఈ సినిమా గ్లింప్స్, సాంగ్స్ మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ వీళ్లను మరింత వెయిట్ చేయించేలా మేకర్స్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఓజీ ట్రైలర్ రిలజ్ డిలే అయిందని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ లీడ్ రోల్ ప్లే చేసిన ఓజీ ట్రైలర్ ఇవాళ (సెప్టెంబర్ 21) ఉదయం 10.08 గంటలకు రిలీజ్ కావాల్సింది. ఈ మేరకు ముందుగా మేకర్స్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు. కానీ ఈ రోజు ఉదయం మాత్రం ట్రైలర్ ను రాత్రి జరిగే ఓజీ కాన్సర్ట్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్.

ఎక్స్ లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ 11 సెకన్ల క్లిప్‌ను పంచుకుంటూ.. "ఓకే ఓకే. రిప్లైస్, కోట్స్ లో మ్యూజిక్ స్టార్ట్ చేయండి. ఓజీ ట్రైలర్ నేడు ఓజీ కాన్సర్ట్ ఈవెంట్ లో విడుదల అవుతుం...