Hyderabad, జూలై 10 -- మొగలి రేకులు సీరియల్‌తో తెగ ఫేమ్ తెచ్చుకున్న ఆర్కే సాగర్ తర్వాత సినిమాల్లో హీరోగా మెప్పించాడు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ది 100. జులై 11న ది 100 థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో ఆర్కే సాగర్.

-మేము ఒక సినిమా లాగే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాం. 'ది 100' అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది. సొసైటీకి ఏదైనా మంచి చేయాలి అనే తపనతో పెట్టిన టైటిల్ ఇది. లక్కీగా కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి 100 అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీకు తెలుస్తుంది.

-ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఈ సినిమాకి అం...