భారతదేశం, జూలై 7 -- ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన పోర్ట్​ఫోలియోలోని రెండు వాహనాల ధరలను తాజాగా పెంచింది. ఈప్రకటించిన ధరల సవరణతో, ఎంపిక చేసిన ప్యాసింజర్ వాహనాలైన టాటా కర్వ్, టాటా టియాగో, టాటా టియాగో ఎన్‌ఆర్‌జీ, టాటా టిగోర్ మోడళ్లు మరింత ప్రియం కానున్నాయి. ముఖ్యంగా, టాటా టియాగో, టాటా కర్వ్ మోడళ్లలోని కొన్ని వేరియంట్‌ల ధరలు పెరిగాయి. పూర్తి వివరాలు..

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లోని కొన్ని వేరియంట్‌ల ధర రూ.10,000 వరకు పెరిగింది. టియాగో XM పెట్రోల్, XZ పెట్రోల్, XZ+ పెట్రోల్, XZA పెట్రోల్, XM iCNG, XZ iCNG, XZA iCNG ట్రిమ్స్‌పై రూ.10,000 పెంపు వర్తించనుంది. అదే సమయంలో, XT పెట్రోల్, XTA పెట్రోల్, XT iCNG, XTA iCNG వేరియంట్‌లపై ఒక్కొక్క దానికి రూ.5,000 పెరిగింది.

అయితే, బేస్ XE పెట్రోల్, XE iCNG ట్రిమ్స్‌పై మాత్రం ఎటువంటి ధరల పెంపు ల...