భారతదేశం, సెప్టెంబర్ 16 -- బాలీవుడ్ హాట్ భామ జాన్వీ కపూర్ తాజాగా ఏఐ చిత్రాల గురించి తన ఆందోళనను వ్యక్తం చేసింది. అనేక మంది సెలబ్రిటీలు గూగుల్ జెమిని నానో బనానా ట్రెండ్‌లో పాల్గొన్నప్పటికీ, జాన్వీ కపూర్ తన ఏఐ చిత్రాలను ఆమె అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో వైరల్ చేస్తున్నారని వెల్లడించింది. తాజాగా ఆమె సినిమా 'సన్నీ సంస్కారి కి తుల్సి కుమారి' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో జాన్వీ ఏఐ టెక్నాలజీ ఇబ్బందికరమైన వైపును హైలైట్ చేసింది.

శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ సన్నీ సంస్కారి కి తుల్సి కుమారిలో తుల్సి పాత్ర పోషిస్తున్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో తన ఏఐ చిత్రాలు వైరల్ అవుతున్న విషయం గురించి మాట్లాడింది. "సోషల్ మీడియాలో చూస్తుంటే నా అనుమతి లేకుండా చాలా ఏఐ చిత్రాలను వైరల్ చేస్తున్నారు. మీరు, నేను అది ఏఐ పిక్ అని చెప్పగలం. కానీ కా...