భారతదేశం, సెప్టెంబర్ 11 -- పరీక్షల మూల్యాంకన విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్సీ). షిఫ్టుల్లో జరిగే పరీక్షల కోసం కొత్త నార్మలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యాంకనలో పారదర్శకత, నిష్పక్షపాతంగా ఉండేలా 'ఈక్విపర్సంటైల్' పద్ధతిని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

మల్టిపుల్​ షిఫ్టుల్లో నిర్వహించే ఎస్​ఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల కఠినత్వం వేర్వేరుగా ఉండవచ్చు. దీని వల్ల ఏ షిఫ్టులోనూ అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు నార్మలైజేషన్ విధానం అవసరమని ఎస్​ఎస్సీ తన అధికారిక ప్రకటనలో వివరించింది.

"అభ్యర్థులందరికీ సరైన న్యాయం జరిగేలా చూడటానికి, కమిషన్ స్కోర్లను నార్మలైజ్ చేస్తుంది. దీని ద్వారా వేర్వేరు షిఫ్టుల అభ్యర్థుల మార్కులను ఒకే ప్రమాణంపై పోల్చి చూడవచ్చు," అని పేర్కొంది.

ఇంతకుముందు, ఈ నార్మలైజేషన్ ప్రక్రియ టాప్ స...