భారతదేశం, జనవరి 3 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాల మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్ర సంచారం జరిగినప్పుడు కూడా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు సమస్యలు వస్తే, కొన్ని సార్లు మంచి ఫలితాలు ఎదురవుతాయి.

శుక్రుడు త్వరలోనే ధనస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం శుక్రుడు ధనస్సు రాశిలో ఉన్నాడు. మరో 10 రోజుల్లో సంతోషం, సమృద్ధి, విలాసాలు, ప్రేమ వంటి వాటికి కారకుడైన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

పది రోజుల్...