భారతదేశం, సెప్టెంబర్ 30 -- OG బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 5: సుజీత్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ చిత్రం 'దే కాల్ హిమ్ ఓజీ' సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. సెప్టెంబర్ 24 న పెయిడ్ ప్రీమియర్లతో ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలకడగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఫస్ట్ సోమవారం (సెప్టెంబర్ 29) మాత్రం ఓజీ వసూళ్లు పడిపోయాయి. మరోవైపు రామ్ చరణ్ తో కలిసి పవన్ కల్యాణ్ స్పెషల్ గా ఓజీ సినిమా చూశాడు.

సక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం ఓజీ మూవీ సోమవారం ఇండియాలో రూ.7.45 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. మూవీ రిలీజైనప్పటి నుంచి ఓ రోజు వసూలు చేసిన అతి తక్కువ కలెక్షన్లు ఇవే. మొత్తం అయిదు రోజుల్లో కలిసి ఇండియాలో ఓజీ మూవీ నెట్ కెలక్షన్లు రూ.147.65 కోట్లకు చేరుకున్నాయి. వీకెండ్ లో అదరగొట్టిన ఈ మూవీ మండే వీక్ డే కావడంతో, సెల...