భారతదేశం, ఆగస్టు 2 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ 'ఓజీ'పై అంచనాలను రెట్టింపు చేస్తూ ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఫైర్ స్టార్మ్ లిరికల్ వీడియోను మూవీ టీమ్ ఇవాళ (ఆగస్టు 2) యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. పవర్ ఫుల్ లిరిక్స్ తో, అదిరిపోయే బీట్ తో ఈ సాంగ్ మరో లెవల్ లో ఉంది. ఓజీ నుంచి సాంగ్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్.. తమన్ ఇచ్చిన ఈ పాటకు ఊగిపోతున్నారు.

టర్న్ డౌన్ ది వైలైన్స్, టర్న్ అప్ ది మ్యూసిక్ అంటూ ఈ ఫైర్ స్టార్మ్ లిరికల్ వీడియో స్టార్ట్ అవుతుంది. ఓజీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. హీరోయిజాన్ని మరో లెవల్ లో ఎలివేట్ చేసేలా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అదిరిపోయే సాంగ్ ఇచ్చాడు. 'ధేర్ విల్ కమ్ ఏ లీడర్ ఓజస్ గంభీర' అంటూ ఇంగ్లిష్ లిరిక్స్ తో సాంగ్ సాగుతుంది.

'అలలిక కదలక భయపడేలే.. క్షణక్షణమొక తల తెగిపడేలే...