భారతదేశం, జనవరి 21 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన రూరల్ డ్రామా 'పంచాయత్' (Panchayat) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫులేరా అనే ఊరి చుట్టూ తిరుగుతూ, కడుపుబ్బా నవ్వించే సిరీస్ ఇదే. అక్కడి గ్రామస్తులు, వాళ్లతో స్థానిక పంచాయతీ సెక్రటరీ పడే కష్టాలు, అక్కడి అమాయకపు రాజకీయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతేడాది జూన్ లో వచ్చిన సీజన్ 4 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక, ఇప్పుడు 'సీజన్ 5' కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

పంచాయత్ వెబ్ సిరీస్ రెండు, మూడు సీజన్ల మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. అయితే మూడు, నాలుగో సీజన్లు మాత్రం ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. ఇప్పుడు ఐదో సీజన్ కూడా అలాగే రాబోతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి 'పంచాయత్ సీజన్...