Hyderabad, సెప్టెంబర్ 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 15న బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి సంచారంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. బుధుడి రాశి మార్పుతో భద్ర యోగం ఏర్పడుతుంది. పంచ మహాపురుష యోగాల్లో ఇది కూడా ఒకటి. ఇది శుభయోగం. అయితే, ఈ శుభయోగం ద్వాదశ రాశులు వారిపై ప్రభావం చూపిస్తుంది.

కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. కొన్ని రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు ఉంటాయి. డబ్బు పెరుగుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మరి భద్ర యోగం ఏఏ రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి వారికి భద్ర యోగం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థ...