భారతదేశం, సెప్టెంబర్ 10 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకం కూడా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే వచ్చే సంఖ్యనే మూలాంకం అని అంటారు.

న్యూమరాలజీ ప్రకారం కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తులు ప్రేమ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తొందరగా రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిపోరు. ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారి ప్రేమకు ఒప్పుకుంటారు. ప్రేమలో పడడానికి, మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఈ తేదీల్లో పుట్టిన వారికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువ సమయం ప్రేమ విషయంలో తీసుకుంటారు? మీరు వీరిలో ఒకరేమో చూసుకోండి.

ఏదైన...