భారతదేశం, ఏప్రిల్ 9 -- జ్యోతిష్య శాస్త్రంలో జాతకాన్ని బట్టి భవిష్యత్తును ఎలా అంచనా వేస్తారో, సంఖ్యాశాస్త్రంలో మన పుట్టిన తేదీని బట్టి మన వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయించవచ్చు. న్యూమరాలజీలో 1 నుంచి 9 వరకు మూలాంకాలు ఉంటాయి. పుట్టిన తేదీలోని అంకెల మొత్తాన్ని మూలాంకం అంటారు (ఉదాహరణకు 16వ తేదీన పుడితే 1+6 = 7). ఈ రోజు మనం అత్యంత ఆసక్తికరమైన వ్యక్తిత్వం కలిగిన మూలాంకం 7 వారి గురించి తెలుసుకుందాం.

ఎవరైనా సరే ఏ నెలలోనైనా 7, 16 లేదా 25 తేదీల్లో జన్మించి ఉంటే, వారి మూలాంకం 7 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. అందుకే వీరు ఇతరులతో పోలిస్తే చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. ఆర్భాటాలు, ఆడంబరాలు వీరికి నచ్చవు. ఒంటరిగా ఉంటూ లోతైన ఆలోచనలు చేయడం వీరి నైజం. శత్రువు సైతం వీరికి ఫిదా అయ్యేలా చేసే ఆ అద్భుత లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మూలాంకం 7 ఉన్...