భారతదేశం, డిసెంబర్ 25 -- నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని నియంత్రించే దిశగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బుధవారం నుంచి ప్రత్యేక 'డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌' సోదాలను ప్రారంభించారు.

డిసెంబరు 31 వరకు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని నగర పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. తొలి రోజైన బుధవారం(డిసెంబర్ 24) ఒక్కరోజే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 304 మంది పట్టుబడ్డారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి 304 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపి తమతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వ...