భారతదేశం, ఫిబ్రవరి 13 -- విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫంకీ (Funky). ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 13) థియేటర్లలో రిలీజైంది. అయితే దీనికి చాలా వరకు నెగటివ్ రివ్యూలు వస్తుండటంపై తాజాగా మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించాడు. తాము ఓ సిల్లీ ఫిల్మ్, ఓ కామెడీ మూవీయే తీశామని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని అన్నాడు.

ఫంకీ సినిమా రిలీజైన రోజే మూవీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. దీనికి చాలా వరకు పాజిటివ్ రివ్యూలేమీ రాలేదు. పైగా మూవీలో కథేమీ లేదని, కొన్ని సీన్లను అలా అతికించి తీసేశారని ఎక్స్ లో పలువురు ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. దీనిపై నాగవంశీ సెటైరిక్ గా స్పందించాడు. మూవీకి వస్తున్న రివ్యూల గురించి మీడియా ప్రశ్నించగా.. అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"నేను ముందే చెప్పాను కదా. ఈ సినిమాకు ప్రెస్ మీట్ కు వచ్చిన ప్రతీసారీ ఇదే చెప్పా...