భారతదేశం, డిసెంబర్ 12 -- బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టాడు. గత 25 ఏళ్లుగా తాను బయట ఎక్కడా డిన్నర్‌కు వెళ్లలేదని, తన జీవితం కేవలం ఇల్లు, షూటింగ్, ఎయిర్‌పోర్ట్ చుట్టూనే తిరుగుతుందని రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వెల్లడించాడు. ఈ క్రమంలో తన స్నేహితుల గురించి కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం (డిసెంబర్ 11) 'రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్'లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఒక సెషన్‌లో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా గత రెండున్నర దశాబ్దాలుగా తాను అనుసరిస్తున్న రొటీన్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

తన లైఫ్ స్టైల్ గురించి సల్మాన్ మాట్లాడాడు. "నేను ఎక్కడికైనా బయటకు వెళ్లి డిన్నర్ ...