Hyderabad, జూలై 6 -- తెలుగు బ్యూటిపుల్ హీరోయిన్స్‌లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇటీవల రిలీజైన తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, తమ్ముడు విడుదలకు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తను నటించే ఓటీటీ సిరీస్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ వర్ష బొల్లమ్మ.

"హీరో నితిన్ చాలా కామ్‌గా ఉంటారని ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ, ఆయన చాలా ఫన్ పర్సన్. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్స్ అవీ ఏమీ లేవు. మేము సరదాగా మాట్లాడుకునేవాళ్లం. చిన్నా, పెద్దా ప్రతి ఆర్టిస్టుకు ఆయన గౌరవం ఇచ్చేవారు. నేను జోక్స్ చెప్పి ఆయనను విసిగించా" అని వర్ష బొల్లమ్మ చెప్పింది.

"నాకు అనిపించింది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటా. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పర్‌ఫార్మ్ చేసేప్పుడు అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే చెప్పాను. కానీ, డైరెక్టర్ గారు డైలాగ్‌లో ఉన్నది ఉన్నట్లు...