భారతదేశం, నవంబర్ 26 -- సౌతాఫ్రికా చేతిలో అత్యంత దారుణమైన పరాభవం తర్వాత కూడా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రాజీనామా చేసే మూడ్‌లో లేనట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో స్వదేశంలో అతని నేతృత్వంలో టెస్ట్ జట్టు ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. గత అక్టోబర్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 0-3తో వైట్‌వాష్ ఎదుర్కొన్న భారత జట్టు, ఇప్పుడు సౌతాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్‌ను కోల్పోవడంతో గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తడమే కాదు.. అతడు దిగిపోవాలన్న డిమాండూ పెరుగుతోంది. అయినా గంభీర్ మాత్రం తాను దిగిపోవడం లేదని స్పష్టం చేశాడు.

ఈ ఏడాది వైట్‌బాల్ క్రికెట్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లను గెలుచుకుంది. గంభీర్ కోచింగ్‌లో ఈ ఫలితాలు బాగానే వచ్చినా, టెస్టులలో మాత్రం ప్రతి సిరీస్‌తోనూ జట్టు ప్రదర్శన దిగజారుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం, వెస్టిండీ...