భారతదేశం, మే 27 -- జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం మూడు ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసానికి (పురుషోత్తమ మాసం) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని 'కమలా ఏకాదశి' లేదా 'పద్మిని ఏకాదశి' అని పిలుస్తారు. దీని విశిష్టత గురించి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ వివరించిన కథ భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. సకల పాపాలను హరించి, కోరిన కోర్కెలు తీర్చే ఈ వ్రత విధానం, దాని వెనుక ఉన్న పురాణ గాథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్వం అవంతీపురంలో శివశర్మ అనే వేద పండితుడు ఉండేవారు. ఆయనకు ఐదుగురు కుమారులు. వారిలో చిన్నవాడైన జయశర్మ దుష్ట సావాసాల వల్ల తప్పుడు మార్గంలో నడిచేవాడు. కొడుకు ప్రవర్తన నచ్చక తండ్రి, బంధువులు అతడిని వెలివేశారు. తన తప్పు తెలుసుకోకుండా అడవుల పాలైన జయశర్మ, ఆకలి దప్పులతో అలమటిస్తూ దైవయోగం వల్ల ప్రయ...