Hyderabad, సెప్టెంబర్ 30 -- నవరాత్రి ఎనిమిదవ రోజున మంగళవారం మహాగౌరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవాలయాలు, ఇళ్లలో భక్తులు మహా గౌరీని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. దుర్గాదేవి ఎనిమిదవ శక్తి పేరు మహాగౌరి. నవరాత్రి ఎనిమిదవ రోజున ఈ అమ్మవారిని పూజిస్తారు.

తల్లిని పూజించడం వల్ల భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. ఈ రోజు, అష్టమి తిథిలో, మధ్యాహ్నం 1.03 గంటల వరకు శోభన యోగం ఉండడం విశేషం. శోభన యోగం కారణంగా, మహాగౌరి ఆరాధన, కన్యా పూజ చాలా ఫలవంతమవుతున్నాయి. నవరాత్రి అష్టమి రోజున, మా మహాగౌరిని షోడశోపచారాలతో పూజిస్తారు. ఉపవాసం ఉంటారు.

ఈ రోజున ఉదయం 6.17 గంటల వరకు మూల నక్షత్రం కూడా వుంది. దీని తరువాత, పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. మహాగౌరి పూజ, కన్యా పూజ బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చు. అంటే ఉదయం 4.37 నుంచి 5.25 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12....