భారతదేశం, జూలై 22 -- జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రోజూ ప్రత్యేకమైనదే. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల ఫలిమాలను బేరీజు వేస్తారు. బుధవారం విఘ్నేశ్వరుడి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు గణనాథుడిని మనసారా ఆరాధించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని, విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం. నేటి జ్యోతిష్య గణనల ప్రకారం.. కొన్ని రాశుల వారికి ఈ రోజు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనుండగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మేష రాశి వారికి నేడు కెరీర్ పరంగా కొత్త సవాళ్లు ఎదురవుతాయి. వీటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగితే మంచి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడే చిన్నపాటి మనస్పర్థలను పరిపక్వతతో పరిష్కరించుకోండి.

ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో అహంకారానికి తావు ఇవ్వకూడదు. వృత్తి జీవితంలో క్రమశిక్షణ మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంద...