భారతదేశం, నవంబర్ 6 -- హిందూ సంప్రదాయంలో శుక్రవారం తల్లి లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తారు. వారంలో ప్రతి రోజూ మారుతున్న గ్రహాలు, నక్షత్రాల గమనం మన దైనందిన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, శుక్రవారం నాడు కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో నూతన అవకాశాలు లభిస్తే, మరికొన్ని రాశుల వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దిన ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

మేష రాశి వారికి నేటి రోజు అత్యంత అనుకూలంగా సాగిపోతుంది. ఉదయం నుంచే మీ కార్యకలాపాలలో వేగం కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల నుంచి తగిన గుర్తింపు లభిస్తుంది...