భారతదేశం, జూలై 20 -- సోమవారం శివారాధనకు ఎంతో విశిష్టమైనది. గ్రహాల గమనాన్ని బట్టి నేడు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తిథి, నక్షత్రాల ఆధారంగా గడిచే ప్రతి రోజు మనిషి జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శివయ్యను ఆరాధించే సోమవారం రోజున, భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థన చేయడం వల్ల మనోశాంతి చేకూరుతుంది. నేటి గ్రహస్థితి ప్రకారం కొన్ని రాశుల వారు ఆర్థికంగా నిలదొక్కుకోగా, మరికొందరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

మేష రాశి: మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సానుకూల మార్పులు మీ జీవితంలో చోటుచేసుకోనున్నాయి. అయితే, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల బంధాలు బలపడతాయి.

వృషభ రాశ...