భారతదేశం, ఏప్రిల్ 13 -- సాధారణంగా సోమవారం అంటే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అయితే ఈరోజు ఉదయం నుంచే ఏకాదశి తిథి ప్రారంభం అవుతోంది. ఏకాదశి అంటే శ్రీమహావిష్ణువుకు అంకితం చేసిన రోజు. శాస్త్రాల ప్రకారం ఒక ఏకాదశి వ్రతం ఆచరిస్తే పదివేల ఏళ్ల తపస్సు చేసినంత పుణ్యం దక్కుతుందని ప్రతీతి. ఈ పవిత్ర ఘడియల్లో ఏ రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

మీ మనసు కాస్త ఆందోళనగా ఉండవచ్చు. అయితే కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. పదోన్నతి లేదా ఉద్యోగ మార్పునకు అవకాశం ఉంది. పని భారం పెరిగినప్పటికీ, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మేధోపరమైన పనుల వల్ల ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తార...