భారతదేశం, ఆగస్టు 22 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు 2025 ఆగస్ట్​ 22 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తారు.

పరీక్షల మొదటి రోజు అభ్యర్థులు వ్యాస రచన (ఎస్సే) పేపర్‌కు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలను తప్పక పాటించాలి. ఆ యూపీఎస్సీ సీఎస్​ఈ మెయిన్స్​ పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలను ఇక్కడ తెలుసుకోండి..

అడ్మిట్ కార్డ్, ఐడీ తప్పనిసరి: పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ-అడ్మిట్ కార్డు ప్రింటౌట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డును ప్రతి సెషన్‌కు తీ...