భారతదేశం, మే 8 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం అంటేనే విలాసం, ప్రేమ, సంపదకు మూలకారకుడు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం రాజభోగాలతో విరాజిల్లుతుందని పండితులు చెబుతుంటారు. ప్రస్తుతం వృషభ రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్న శుక్రుడు, తన నక్షత్రాన్ని మార్చుకోవడానికి సిద్ధమయ్యాడు.

హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు అనగా మే 8, 2026 శుక్రవారం రాత్రి 09:51 గంటలకు శుక్రుడు రోహిణి నక్షత్రం నుంచి నిష్క్రమించి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (మంగళుడు). శుక్రుడు మే 19 వరకు కుజుడి నక్షత్రంలోనే సంచరిస్తాడు. కుజుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక కాగా, శుక్రుడు సౌందర్యానికి, సంపదకు కారకుడు. ఈ రెండు గ్రహాల ప్రభావం కలవడం వల్ల కొన్ని రాశుల వారి జాతకాల్లో 'ధన యోగం' పట్టబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూ...