Hyderabad, సెప్టెంబర్ 15 -- సింహ రాశిలో శుక్రుని సంచారం: గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. నేటి నుండి, సింహరాశిలో శుక్రుడు సంచారం చేస్తాడు. సింహ రాశికి అధిపతి సూర్య భగవానుడు. శుక్రుడు సంపద, ధనం, విలాసాలకు కారకుడు. శుక్ర సంచారం సంపద, ఆర్థిక పరిస్థితి, ప్రేమ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. పంచాంగం ప్రకారం, శుక్రుడు సెప్టెంబర్ 15, 2025 న సోమవారం తెల్లవారుజామున 12:23 గంటలకు సింహరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు అక్టోబర్ ఉదయం 10:53 నిమిషాల పాటు ఈ రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు.

జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, సింహరాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశి చక్రాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఇది మీ ప్రేమ జీవితం, డబ్బు, ఆరోగ్యం మరియు కెరీర్ పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మరి ఇక సూర్యుని సింహ రాశిలో శుక్రుడి సంచారం ఏ ...