భారతదేశం, అక్టోబర్ 4 -- ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'మిరాయ్' దూసుకొస్తోంది. సడెన్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ను అనౌన్స్ చేశారు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరో కాగా, మంచు మనోజ్ విలన్ గా నటించాడు.

తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా మిరాయ్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (అక్టోబర్ 4) ప్రకటించారు. అక్టోబర్ 10న మిరాయ్ ఓటీటీ రిలీజ్ కానుందని జియోహాట్‌స్టార్‌ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

''9 గ్రంథాలు. అంతులేని శక్తి. బ్రహ్మాండాన్ని కాపాడే ఒక సూపర్ యోధ. ఇండియా సొంత సూపర్ హీరో మిరాయ్ మీ ఇంటికి వస్తున్నాడు. అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవు...