భారతదేశం, జూలై 5 -- ఒక్క నెలలో కురవాల్సిన వర్షాలు.. కేవలం కొన్ని గంటల్లో పడితే? అమెరికా టెక్సాస్​లో ఇదే జరిగింది. ఫలితంగా ఆ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలతో పాటు వరదలు ముంచ్చెత్తడంతో టెక్సాల్​లో కనీసం 13మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు. వీరిలో 23మంది బాలికలు కూడా ఉన్నారు.

అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కెర్ కౌంటీలో రాత్రిపూట కనీసం 10 ఇంచ్​ (25 సెంటీమీటర్లు) వర్షం కురవడంతో గౌడలూప్​ నదిలో వరద పోటెత్తింది. ఈ వరద మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు చెబుతుండటంతో ఆకస్మిక వరదల కారణంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది! కెర్ కౌంటీ షెరీఫ్ లారీ లీథా వరదల్లో 13 మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ డాన...