Hyderabad, సెప్టెంబర్ 17 -- మోహిత్ సూరి డైరెక్ట్ చేసిన 'సయ్యారా' అనే సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన నాన్-ఇంగ్లీష్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ ఎరోటిక్ థ్రిల్లర్ 'ఫాల్ ఫర్ మీ', నెట్‌ఫ్లిక్స్ హిందీ ఒరిజినల్ 'ఇన్‌స్పెక్టర్ జెండే' ని వెనక్కి నెట్టింది. బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీలోనూ అదే ఊపు కొనసాగిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ లో అత్యుత్తమంగా పర్ఫార్మ్ చేస్తున్న టైటిల్స్ డేటాబ్యాంక్ అయిన టుడుమ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ సినిమాల లిస్ట్‌లో 'సయ్యారా' నంబర్ 1లో ఉంది. దీనికి 3.7 మిలియన్ల వ్యూస్, 9.3 మిలియన్ గంటల వ్యూయింగ్ ఉంది. ఇక 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూయింగ్‌తో రెండో స్థానంలో ఉంది. మనోజ్ బాజ్‌పేయీ న...