Hyderabad, ఆగస్టు 22 -- నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే ప్రేక్షకుల కోసం మరో సినిమా వస్తోంది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా పేరు ఇన్‌స్పెక్టర్ జెండె (Inspector Zende). 1970, 80ల్లో బికినీ కిల్లర్ గా పేరుగాంచిన ఛార్లెస్ శోభరాజ్ ను పట్టుకున్న పోలీసు జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది.

నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇన్‌స్పెక్టర్ జెండె సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా శుక్రవారం (ఆగస్టు 22) వెల్లడించింది. "ఇన్‌స్పెక్టర్ జెండె త్వరలోనే డ్యూటీ మొదలుపెట్టబోతున్నాడు.

ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ కు ఇక రోజులు దగ్గర పడ్డాయ్. ఇన్‌స్పెక్టర్ జెండెను సెప్టెంబర్ 5 నుంచి కేవలం నెట్‌ఫ్లిక్స్ లో చూడండి" అనే క్యాప్షన్ త...