Hyderabad, జూలై 28 -- నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే వచ్చిన వెబ్ సిరీస్ మండల మర్డర్స్. వాణి కపూర్ నటించిన ఈ సిరీస్ జులై 25న విడుదలైనప్పటి నుండి.. ఇందులోని చిక్కుముడుల కథాంశం, మిస్టరీ వాతావరణం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవేళ మీరు ఈ షోను ఇప్పటికే చూసి మీకు నచ్చినట్లయితే.. మరిన్ని థ్రిల్లర్ సిరీస్ లు కూడా ఇక్కడ ఇస్తున్నాం. వాటిని కూడా చూడండి. జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 ఈమధ్యే జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తొలి సీజన్, తర్వాత వచ్చిన 1.5 సీజన్ ఎలా అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో ఈ రెండో సీజన్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఈసారి సైబర్ వార్ ఆధారంగా సిరీస్ ను మలిచారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈ ముప్పును ఎలా తప్పిస్తారన్నది ఇందులో చూడొచ్చు. ఒకవేళ అంత...