Hyderabad, ఆగస్టు 15 -- దర్శకుడు విశాల్ ఫురియా రూపొందించిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'మా' (Maa). జూన్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో చూడని అభిమానుల కోసం నెట్‌ఫ్లిక్స్ లోకి మూవీ రాబోతోంది.

కాజోల్ లీడ్ రోల్లో నటించిన మూవీ మా. తన కూతురిని కాపాడుకోవడానికి ఓ తల్లి ఎంత వరకూ వెళ్తుందన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా వచ్చే శుక్రవారం (ఆగస్టు 22) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

'సైతాన్' (2024)లో పరిచయం చేసిన మైథలాజికల్ కథా ప్రపంచాన్ని విస్తరిస్తూ, 'మా' కూడా అదే నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా కేవలం మానసిక భయాలపై కాకుండా జానపద కథలు, మతపరమైన చిహ్నాల నుండి ప్రేరణ పొందిన హారర్‌ను మరింత లోతుగా అన్వేషిస్తుంది. ఈ కథ అంబిక (కాజోల్) అనే తల్లి చుట్టూ తిరుగుతుంది. ...