భారతదేశం, నవంబర్ 4 -- నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటి వరకూ వచ్చిన ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఢిల్లీ క్రైమ్ (Delhi Crime). ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయ్యాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఇప్పుడు అలాంటిదే మరో కథతో మూడో సీజన్ ను తీసుకొస్తోంది. నవంబర్ 13 నుంచి ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. మంగళవారం (నవంబర్ 4) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఢిల్లీ డీసీపీ వర్తికా చతుర్వేదిగా సీనియర్ నటి షెఫాలీ షా తిరిగి వస్తోంది. ఇక ఈ కొత్త సీజన్ లో బడీ దీదీ అనే విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి, మహారాణి వెబ్ సిరీస్ ఫేమ్ హుమా ఖురేషీ నటిస్తుండటం విశేషం.
ఈ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అమ్మాయిల అక్రమ రవాణా చుట్టూ తిరిగే కథలా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఆ రాకెట్ ను ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.