భారతదేశం, నవంబర్ 10 -- తమిళ నటి గౌరీ కిషన్ ఇటీవల యూట్యూబర్ కార్తీక్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. 'అదర్స్' సినిమా ప్రెస్ మీట్‌లో తన బరువు గురించి ఆ సినిమా సహ-నటుడు ఆదిత్య మాధవన్, దర్శకుడు అబిన్ హరిహరన్ లను ప్రశ్నించినందుకు ఆమె విమర్శలు గుప్పించింది. ఇప్పుడు ఈ ఘటనను కేవలం "అర్థం చేసుకోకపోవడం"గా కొట్టిపారేయడాన్ని ఖండిస్తూ.. ఆ యూట్యూబర్ క్షమాపణను అంగీకరించడానికి గౌరీ నిరాకరించింది.

యూట్యూబర్ కార్తీక్ క్షమాపణ వీడియో విడుదల చేసిన తర్వాత గౌరీ కిషన్ సోమవారం (నవంబర్ 10) తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మరోసారి ఆ జర్నలిస్టును టార్గెట్ చేసింది. అతని క్షమాపణ వీడియోలో జవాబుదారీతనం లేదని, అది కేవలం నిజాయితీ లేని ప్రవర్తనగా అనిపించిందని ఆమె విమర్శించింది.

"జవాబుదారీతనం లేని క్షమాపణ, అసలు క్షమాపణే కాదు" అని గౌరీ సోషల్ మీడియాలో రాసింది. జర్నలిస్ట్ క్...