Hyderaba, అక్టోబర్ 6 -- టాలీవుడ్ నటుడు, హీరో నందు, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ జంటగా నటించిన తెలుగు బొల్డ్ థ్రిల్లర్ సినిమా 'అగ్లీ స్టోరీ'. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మించారు. అగ్లీ స్టోరీ సినిమాకు ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదలైన అగ్లీ స్టోరీ టైటిల్ గ్లింప్స్‌, 'హే ప్రియతమా' లిరికల్ సాంగ్ రిలీజ్ ఎక్సట్రాడినరీ రెస్పాన్స్ అందుకున్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అగ్లీ స్టోరీ టీజర్ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

మంటల మీదుగా సిగరెట్ కాలుస్తున్న నందును 'అగ్లీ స్టోరీ' టీజర్‌లో ముందుగా పరిచయం చేశారు. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అన్నట్టు సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత అవికా గోర్ పరిచయం జరిగింది. నందును కాకుండా అవికా గ...