భారతదేశం, ఆగస్టు 13 -- నీట్​ యూజీ 2025 రౌండ్ 1 సీటు కేటాయింపు ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. కౌన్సెలింగ్‌లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో చూసుకోవచ్చు.

ఫలితాల్లో ఏమైనా తేడాలు ఉన్నట్లు గుర్తిస్తే ఆగస్టు 13, 2025 ఉదయం 11:00 గంటలలోపు mccresultquery@gmail.com అనే ఈమెయిల్‌కు తెలియజేయాలని ఎంసీసీ స్పష్టం చేసింది. ఆ తర్వాత, ఈ తాత్కాలిక ఫలితాలను 'ఫైనల్'గా పరిగణిస్తామని కమిటీ వెల్లడించింది.

ఈ తాత్కాలిక ఫలితాలు కేవలం సూచిక మాత్రమేనని, వాటిలో మార్పులు ఉండవచ్చని ఎంసీసీ తెలిపింది. తాత్కాలిక ఫలితాల్లో కేటాయించిన సీటుపై అభ్యర్థులు ఎలాంటి హక్కును క్లెయిమ్ చేయలేరని, కోర్టులో కూడా దీనిని సవాలు చేయలేరని తన నోటీసులో పేర్కొంది.

అభ్యర్థులు ఫైనల్ రిజల్ట్ విడుదలయ్యాక, ఎంసీ...